Sunday, November 17, 2024

బాలుడిని తల్లిదండ్రుల చెంతకు చేర్చిన సైబరాబాద్ పోలీసులు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆడుకుంటూ ఇంటి వద్ద నుంచి తప్పిపోయిన బాలుడిని గంట వ్యవధిలో తిరిగి తల్లిదండ్రులకు అప్పగించిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం…
శనివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో కొండాపూర్‌కు చెందిన హరిశివ(3) ఇంటి నుండి తప్పిపోయాడు. ఇంటి నుంచి బయటికి వచ్చిన బాలుడు తిరిగి ఇంటికి చేరే దారి విషయం ఆయోమయానికి గురై రోడ్డు వెంట తిరుగుతున్నాడు.

ఈ క్రమంలోనే బాలుడు కొండాపూర్‌లోని వైట్ ఫీల్డ్ రోడ్డులో అయోమయంగా తిరుగుతుండగా, అటువైపు వెళ్తున్న రాజశేఖర్ అనే వ్యక్తి బాలుడిని గమనించి వివరాలు అడిగాడు. బాలుడు తన వివరాలు సరిగా చెప్పలేకపోవడంతో బాలుడిని తీసుకుని వచ్చి మాదాపూర్ డిసిపి ఆఫీస్‌లో అప్పగించాడు. మాదాపూర్ డిసిపి డాక్టర్ జి వినీత్ ఆదేశాల మేరకు బాలుడి తల్లిదండ్రుల ఆచూకీ తెలుసుకునేందేందుకు రంగంలోకి దిగారు. గంట వ్యవధిలోని మాదాపూర్ ఇన్ స్పెక్టర్ జి. మల్లేష్ , సిబ్బంది తప్పిపోయిన బాలుడి తల్లితండ్రుల వివరాలు సేకరించి, బాలుడిని వారికి అప్పగించారు. బాలుడిని, పోలీసుల దగ్గరకు చేర్చిన రాజశేఖర్‌ని మాదాపూర్ డిసిపి అభినదించారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News