Wednesday, January 22, 2025

బెల్టు షాపులపై సైబరాబాద్ ఎస్‌ఓటి పోలీసులు దాడి

- Advertisement -
- Advertisement -

సైబరాబాద్ ఎస్‌ఓటి పోలీసులు కమిషనరేట్ పరిధిలోని బెల్టు షాపులపై ఆకస్మికంగా దాడి చేశారు. దాడుల్లో అక్రమంగా విక్రయిస్తున్న మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు 796.05లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు, వాటి విలువ రూ.7,47,368 ఉంటుంది. సైబరాబాద్ ఎస్‌ఓటి పోలీసులు కమిషనేట్ పరిధిలోని ఎనిమిది పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న బెల్టు షాపులపై దాడులు చేశారు. ఎన్నికల ప్రకటన రాగానే అక్రమంగా మద్యం విక్రయిస్తున్న దుకాణాలను మూసివేయాలని పోలీసులు హెచ్చరించారు.

అయినా కూడా చాలా ప్రాంతాల్లో బెల్టు షాపుల వారు మద్యం విక్రయిస్తున్నారు. దీంతో పోలీసులు ఒక్కసారిగా దాడులు చేశారు, పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే 480 లీటర్ల మద్యాన్ని అక్రమంగా రవాణా చేస్తుండగా మేడ్చల ఎస్‌ఓటి పోలీసులు పట్టుకున్నారు. మోకిలా పిఎస్- 45.2, రాజేంద్రనగర్ పిఎస్ – 94..78, పేట్ బషీరాబాద్ పిఎస్ 480, శామీర్‌పేట్ పిఎస్- 11.25, బాచుపల్లి పిఎస్- 55.8, మైలార్‌దేవ్‌పల్లి పిఎస్- 17.4, నందిగామ పిఎస్ 19.14, దుండిగల్ పిఎస్ – 6.43 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News