Friday, December 20, 2024

సెల్లార్‌లను కిచెన్ కోసం ఉపయోగించవద్దు…

- Advertisement -
- Advertisement -

హాస్టల్ యాజమానులతో సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి నారాయణ్‌నాయక్ సమావేశం

హైదరాబాద్: హాస్టల్ నిర్వాహకులు సెల్లార్‌లను కిచెన్ కోసం ఉపయోగించవద్దని సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ పోలీస్ కమిషనర్ నారాయణ్‌నాయక్ అన్నారు. కూకట్‌పల్లిలోని పలు హాస్టల్ యజమానులతో గురువారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెల్లార్‌లను కిచెన్ కోసం ఉపయోగించడం సరికాదని అన్నారు. దీని వల్ల హాస్టల్‌లో ఉండే వారు రోడ్లపక్కన వాహనాలను నిలుపుతున్నారని, వాటి వల్ల ట్రాఫిక్‌కు ఇబ్బందులు ఏర్పడుతున్నాయని తెలిపారు.

కిచెన్లను సెల్లార్ నుంచి టెర్రస్‌లోకి మార్చుకోవాలని ఆదేశించారు. హాస్టళ్ల యజమానులు పార్కింగ్ కోసం స్థలాన్ని కేటాయించాలని ఆదేశించారు. పార్కింగ్ కోసం స్థలం లేకుంటే దగ్గరలో ఉన్న స్థలాలను పార్కింగ్ కోసం ఉపయోగించుకోవాలని అన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ డిసిపి శ్రీనివాసరావు, కూకట్‌పల్లి ఎసిపి ధనలక్ష్మి, కెపిహెచ్‌బి ఇన్స్‌స్పెక్టర్ నర్సింహరావు, ఆర్‌ఐ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News