Wednesday, January 29, 2025

జపాన్ ఎయిర్‌లైన్స్‌పై సైబర్‌దాడి

- Advertisement -
- Advertisement -

సంవత్సర ముగింపు సీజన్‌లో సైబర్‌దాడి జరగడంతో 20 దేశీయ విమానాల రాకపోకల్లో ఆలస్యం చోటుచేసుకుందని జపాన్ ఎయిర్‌లైన్స్ గురువారం తెలిపింది. కాగా దీని ప్రభావం విమానాల భద్రతపై పడలేదని స్పష్టంచేసింది. గురువారం ఉదయం ఇంటర్నల్, ఎక్స్‌టర్నల్ సిస్టంలలో మాల్‌ఫంక్షన్ చోటుచేసుకుందని, దాంతో సమస్య మొదలయిందని పేర్కొంది. సైబర్ అటాక్ కారణంగా 24 దేశీయ విమానాలు 30 నిమిషాలు ఆలస్యంగా నడిచాయని వివరించింది. కాగా దేశీయ, అంతర్జాతీయ విమానాల టికెట్ల అమ్మకాలను గురువారం తాత్కాలికంగా సస్పెండ్ చేసింది. సిస్టంను వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని రవాణా శాఖ మంత్రి గురువారం జపాన్ ఎయిర్‌లైన్స్‌ను ఆదేశించినట్లు చీఫ్ కేబినెట్ సెక్రటరీ యోషిమాస హయాషి విలేకరుల సమావేశంలో తెలిపారు. న్యూయిర్ హాలీడేస్ కారణంగా జపాన్ ట్రావెల్ సీజన్ పుంజుకుంటోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News