Monday, December 23, 2024

ఎసిబి అధికారులమంటూ డబ్బులు డిమాండ్ చేసిన సైబర్ నేరగాళ్లు

- Advertisement -
- Advertisement -

సిద్దిపేట క్రైమ్ : ఎసిబి అధికారులమంటూ ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేసిన సైబర్ నేరగాళ్లు పట్ల అప్రమత్తంగా ఉండాలని సిపి శ్వేత శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సిద్దిపేట జిల్లాలోని ముగ్గురు జిల్లా అధికారులకు ఆపరిచిత వ్యక్తి పోన్ చేఐసి ఎసిబి హెడ్ ఆఫీస్ హైదరాబాద్ నుండి 7619189985 ద్వారా మాట్లాడుతూ మీరు డబ్బులు తీసుకుంటున్నట్లు మీపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. మీరు ఇతరుల నుండి డబ్బులు అడిగారని ఫిర్యాదులు వచ్చాయని రూ. 3 లక్షలు పంపిస్తే మీపై వచ్చిన ఆరోపణలలో విచారణ చేసి కొట్టి వేస్తామని లేదంటే ఏసిబి దాడులు చేస్తారని బెదిరించారని తెలిపారు. ముగ్గురు అధికారులకు అనుమానం వచ్చి జాతీయ సైబర్ సెల్ హెల్ప్ లైన్ నెంబర్ 1930 ఫోన్ చేసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా జిల్లా, డివిజన్, మండల స్థాయి అధికారులు ఎవరూ కూడా అపరిచితుల నుండి పోన్ కాల్ చేస్తే ఏ ప్రభుత్వ అధికారి కూడా నమ్మవద్దని వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయాలని ఆటువంటి వారికి ఎలాంటి డబ్బులు చెల్లించకూడదని తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News