- Advertisement -
లక్నో: గత సంవత్సరం కరోనా వేగంగా వ్యాపిస్తుండడంతో లాక్‌డౌన్ విధించినప్పుడు సైకిల్ గర్ల్‌గా పేరొందిన జ్యోతి కుమారి తండ్రి హార్ట్ ఎటాక్‌తో చనిపోయాడు. జ్యోతి కుమారి తండ్రి మోహన్ పాశ్వాన్ హర్యానాలో గురుగ్రామ్‌లో రిక్షా నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. అతడి కాలికి గాయం కావడంతో తండ్రి బాగోగులు చూడటానికి కూతురు బీహార్ నుంచి మోహన్ వద్దకు వెళ్లింది. గత ఏడాది కరోనా వేగంగా విజృంభిస్తుండడంతో దేశ వ్యాప్తంగా మోడీ ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. దీంతో అతడికి ఉపాధి లేకపోవడం జీవన దుర్భరంగా మారింది. వాహనాలు లేకపోవడంతో గురుగ్రామ్ నుంచి బీహార్‌లోని దర్భంగాకు సైకిల్‌పై తండ్రితో 1100 కిలో మీటర్లు జ్యోతి ప్రయాణించింది. తండ్రిని వెనక కూర్చొబెట్టుకొని 1100 కిలో మీటర్లు తొక్కడంతో బాలిక వార్తల్లోకి ఎక్కింది.
- Advertisement -