Sunday, December 29, 2024

దేశం సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ సైకిల్ యాత్ర

- Advertisement -
- Advertisement -

భద్రాచలం : దేశం సుభిక్షంగా ఉండాలని, శాంతి నెలకొనాలని, జల, జంతు, వన సంరక్షణ కోరుతూ.. సైకిల్‌పై నెలల తరబడి సైకిల్ యాత్ర కొనసాగిస్తున్న వ్యక్తి భద్రాచలం చేరుకున్నాడు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా సింగనూర్ నివాసి చాట్రాతి విజయగోపాలకృష్ణ దేశ యాత్రలో భాగంగా పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ శనివారం భద్రాచలం చేరుకొని శ్రీ సీతారామచంద్రస్వామిని దర్శింకున్నారు.

గోపాలకృష్ణ 2022 మార్చి 11న స్వగ్రామం నుండి బయలుదేరి ఇప్పటికి 15 రాష్ట్రాలు సైకిల్‌పై చుట్టేశారు. పవిత్ర పుణ్యక్షేత్రాలు, అడవులు, జంతువులు, నదులను సందర్శించినట్లు ఆయన తెలిపారు. తమ పూర్వికులది ఏపీలోని తణుకు మండలం కొమరవరం అని, 1971లో రాయచూర్ వెళ్లి స్థిరపడినట్లు పేర్కొన్నారు. ఇప్పటి వరకు ఘనాపూర్, తుల్జాపూర్, షిరిడి, నాసిక్, త్రయంబక్,కాశీ, అయోద్య, ఆగ్రా, లక్నో, మధుర, హరియానా, పంజాబ్ తదితర ప్రాంతాలను పర్యటించినట్లు చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News