Monday, January 20, 2025

సైక్లింగ్ లేదా వాకింగ్.. ? ఆరోగ్యానికి ఏది మంచిది.. ?

- Advertisement -
- Advertisement -

సైక్లింగ్, వాకింగ్ రెండూ అత్యుత్తమ శారీరక కార్యకలాపాలు. ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరుస్తూ, బరువుని తగ్గిస్తూ, మానసిక ఆరోగ్యంతో సహా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఇప్పుడు ఈ ఆర్టికల్ ద్వారా సైక్లింగ్, వాకింగ్ ఏది మంచిదో తెలుసుకుందాం.

వాకింగ్ అనేది సహజమైన వ్యాయామం. ఇది మోకాలి ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను కలిగిస్తుంది. అంతేకాకుండా ఇది కీళ్ల ఫ్లెక్సిబిలిటీని నిర్వహించడానికి, మోకాళ్ల చుట్టూ ఉన్న కండరాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. వాకింగ్ మోకాలి కీళ్లపై ఒత్తిడిని తగ్గించడానికి ఇది చాలా ముఖ్యమైన బరువును నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇక సైక్లింగ్ విషయానికి వస్తే..మీరు సైకిల్ నడుపుతున్నప్పుడు, మీ పాదాలు పెడల్స్‌తో టచ్‌లో ఉంటాయి. ఇది వాకింగ్ తో పోలిస్తే..మోకాలి కీళ్లపై ఒత్తిడిని తగ్గిస్తుంది. మోకాలి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సైక్లింగ్ ఎంతో సహాయపడుతుంది.

సైకిల్ తొక్కడం లేదా వాకింగ్ చేయడం రెండూ మోకాళ్లను బలోపేతం చేయడానికి ఎంతో ఉపయోగపడతాయి. ఒకవేళ మీకు మోకాళ్లలో తీవ్రమైన నొప్పి ఉంటే..నడక మంచి ఎంపిక అని చెప్పవచ్చు. అయితే, మీ మోకాళ్లు ఆరోగ్యంగా ఉంటే..మీరు సైకిల్ తొక్కవచ్చు. మోకాళ్లను బలోపేతం చేయడానికి క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం ముఖ్యం. మీకు మోకాళ్లలో నొప్పి ఉంటే..మీకు సైక్లింగ్, వాకింగ్ లో ఏది ఉత్తమమో తెలుసుకోవడానికి వైద్యుడిని లేదా ఫిజియోథెరపిస్ట్‌ను సంప్రదించడం చాలా మంచిది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News