Monday, December 23, 2024

ఎపికి ‘అసని’ ఎఫెక్ట్

- Advertisement -
- Advertisement -

Cyclone Asani effect on andhra pradesh

తెలంగాణలో ఓ మోస్తరు నుంచి తేలికపాటి వర్షాలు
రానున్న మూడు రోజులు రాష్ట్రంలో వానలు

హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తుఫానుగా మారింది. ఈ తుఫానుకు ‘అసని’గా నామకరణం చేశారు. గంటకు 16 కి.మీ వేగంతో కదులుతున్న ఈ తుఫాను ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నానికి ఆగ్నేయంగా 970 కి.మీ దూరంలో ఉంది. ఒడిశా పూరీకి 1030 కి.మీ దూరంలో ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. వాయువ్య దిశగా కదులుతున్న ఈ ‘అసని’ తుఫాను రాబోయే 24 గంటల్లో మరింత బలపడి తీవ్ర తుఫానుగా మారనుందని అధికారులు వెల్లడించారు. మే 10వ తేదీన ఒడిశా తీరంలో వాయువ్య బంగాళాఖాతంలో ఇది బలహీన పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ తుఫానుతో ఎపిలోని పలు జిల్లాలు భారీ వర్షాలు కురుస్తాయని, తెలంగాణలో కొన్ని జిల్లాలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.

ఆదివారం సాయంత్రం తీవ్ర తుఫాన్‌గా….

రాష్ట్రంలో వచ్చే మూడురోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఉపరితల ద్రోణి ప్రభావంతో వర్షాలు కురిసే అవకా శం ఉందని అధికారులు తెలిపారు. విదర్భ నుంచి కర్ణాటక వరకు ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని, తుఫానుగా బలపడి ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని అధికారులు పేర్కొన్నారు. ఆగ్నేయ బంగాళాఖాతం, దానికి ఆనుకొని ఉన్న దక్షిణ అండమాన్ సముద్రంలో శుక్రవారం ఏర్పడిన అల్పపీడనం వాయువ్యంగా పరివర్తనం చెంది శనివారం ఉదయానికి వాయుగుండంగా, రాత్రికి తీవ్ర వాయుగుండంగా బలపడిందని అధికారులు తెలిపారు. ఆదివారం ఉదయానికి అది తుఫాన్‌గా, సాయంత్రానికి తీవ్ర తుఫాన్‌గా మారుతుందని వాతావరణ శాఖ ప్రకటించింది. తుఫాన్‌గా మారాక దానికి ‘అసాని’ అని పేరు పెట్టారు. ఈ పేరును శ్రీలంక సూచించగా, సింహళి భాషలో అసాని అంటే ‘కోపం’ అని అర్థం.

ఎపి తీర ప్రాంతాల్లో గంటకు 70 నుంచి 90 కి.మీ వేగంతో…

‘అసని’ ప్రభావంతో ఎపి తీర ప్రాంతాల్లో గంటకు 70 నుంచి 90 కి.మీ వేగంతో గాలులు వీయనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి గంటకు 105 నుంచి 125 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని ఈ తుఫాను ప్రభావంతో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తీర ప్రాంతాల్లో భారీ వర్షపాతం నమోదు కానుందని అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News