- Advertisement -
అమరావతి: ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడింది. విశాఖకు వెయ్యి కిలోమీటర్ల దూరంలో వాయుగుండం కేంద్రీకృతమైందని.. సాయంత్రానికి అది తీవ్ర తుఫాన్ గా మారనున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. దీనికి అసాని తుఫాన్ అని వాతావరణ శాఖ అధికారులు నామకరణం చేశారు. తీరం వెంబడి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని అధికారులు చెప్పారు. అసాని తుఫాన్ ఒడిశా-పశ్చిమ బెంగాల్ వైపు పయనించే అవకాశం ఉందని పేర్కొన్నారు. తుఫాన్ ప్రభావంతో ఇప్పటికే ఎపిలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురుస్తున్నాయి. వచ్చే 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని అధికారులు తెలిపారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు.
Cyclone Asani form in Bay of Bengal
- Advertisement -