Friday, April 4, 2025

బలహీనపడ్డ అసని తుఫాను

- Advertisement -
- Advertisement -

 

Asani

విశాఖపట్నం:  వచ్చే 48 గంటల్లో ‘అసాని’ తుఫాను బలహీనపడే అవకాశం ఉన్నందున ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాలను దాటకపోవచ్చని భారత వాతావరణ శాఖ సోమవారం తన తాజా అంచనాలో తెలిపింది.  అయితే మే 9, 10 తేదీల్లో బంగాళాఖాతంలోని మధ్య ప్రాంతాల మీదుగా, ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్‌కు ఆనుకుని ఉన్న వాయువ్య ప్రాంతం మీదుగా మే 10, 12 తేదీల్లో మత్స్యకారులు, తీర ప్రాంతవాసులు లోతైన సముద్రంలోకి వెళ్లవద్దని సూచించారు.

సింహళంలో ‘కోపం’ అని అర్ధం వచ్చే అసని, బంగాళాఖాతంలో కోస్తా ఆంధ్ర ప్రదేశ్ మరియు ఒడిశా వైపు గంటకు 25 కి.మీ వేగంతో వాయువ్య దిశగా కదులుతోంది.

అసని తుఫాను తుఫానుగా క్రమంగా బలహీనపడి ఉత్తర-ఈశాన్య దిశగా తిరిగి ఒడిశా తీరం నుంచి వాయువ్య బంగాళాఖాతం వైపు కదులుతుందని వాతావరణ శాఖ తెలిపింది.

ఒడిశా తీర ప్రాంతంలోని పలు జిల్లాల్లో మంగళవారం సాయంత్రం నుంచి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, గజపతి, గంజాం, పూరి మీదుగా ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు (7-11 సెం.మీ.) కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ  తెలిపింది.

తుఫాను సోమవారం మధ్యాహ్నం నాటికి పూరీకి దక్షిణ ఆగ్నేయ దిశలో 680 కిలోమీటర్లు, విశాఖపట్నం నుండి 580 కిలోమీటర్ల దూరంలో ఉంది.

తుఫాను బీభత్సం సృష్టించే సూచనలు లేకపోయినా జాతీయ, రాష్ట్ర విపత్తు సహాయ విభాగాలు అప్రమత్తంగా ఉన్నాయి. తీవ్ర తుఫాను సమీపిస్తున్న దృష్ట్యా ఒడిశాలోని అన్ని ఓడరేవుల్లో సుదూర హెచ్చరిక సిగ్నల్ 2 (ఓడలను తీరం దగ్గరకు రావద్దని కోరడం) ఎగురవేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News