- Advertisement -
అరేబియా సముద్రంలో గుజరాత్, పాకిస్థాన్ తీరంలో నెలకొన్న అస్నా తుపాన్ భీకర రూపం దాల్చింది. గుజరాత్‌లో బారీ వర్షాలు, పెనుగాలుల ఘటనల్లోఇప్పటి వరకూ 42 మంది చనిపోయారు. తుపాన్ తీవ్రత నేపథ్యంలో తీరం వెంబడి ఉన్న ప్రాంతాల నుంచి వేలాది మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అరేబియా సముద్రంలో ప్రత్యేకించి ఇక్కడ తుపాన్‌లు రావడం అరుదు.
దాదాపు 64 ఏండ్ల తరువాత ఈ సీజన్‌లో ఈ తుపాన్ రావడంపై వాతావరణ పరిశోధకులు ప్రత్యేక దృష్టి సారించారు. అస్నా తుపాన్ గుజరాత్ తీరం నుంచి క్రమేపీ పాకిస్థాన్ వైపు సాగుతోందని ఐఎండి తెలిపింది.తుపాన్ గుజరాత్‌లోని భుజ్‌కు దాదాపు 190 కిలోమీటర్ల దూరంలో పశ్చిమ వాయవ్య దిశలో ముందుగా తలెత్తింది. తరువాత దిశ మార్చుకుందని వెల్లడించారు. ఈ అస్నా తుపాన్ స్థాయిల్లో వ్యత్యాసాలతో దాదాపు నాలుగయిదు రోజులు గుజరాత్ తీరంపై ప్రభావం చూపడం కీలక పరిణామం అయింది.
- Advertisement -