Sunday, December 22, 2024

గుజరాత్ తీరంలో అల్పపీడనం…ఆరు గంటల్లో అస్నా తుఫాన్ ఛాన్స్

- Advertisement -
- Advertisement -

అహ్మదాబాద్: అరేబియా సముద్రంలో మరో ఆరు గంటల్లో తుఫాను(అస్నా) ఏర్పడనుందని కేంద్ర వాతావరణ శాఖ హెచ్చరించింది. కచ్ తీరం, ఈశాన్య అరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం ఏర్పడిందని, అది కాస్తా 6 గంటల్లో తుఫానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. ప్రస్తుతం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతోంది, రెండు రోజుల్లో తీరం దాటనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే గుజరాత్ రాష్ట్రంలో భారీ వానలు కురుస్తున్నాయి. అంతా జలమయం అయిపోయింది. మొసళ్లు కూడా జనవాసాలలోకి వచ్చేస్తున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News