- Advertisement -
అమరావతి: బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడడంతో ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉండడంతో మూడు రోజుల పాటు మత్యకారులు వేటకు వెళ్లొద్దని హెచ్చరిక జారీ చేసింది. పర్యాటకులు, సందర్శకులు తీరం వెంట సముద్రపు లొపలికి వెళ్లొద్దని తెలిపింది. ఇప్పటికే భారీ వర్షాలతో ఉతరాంధ్ర అతలాకుతలం అవుతోంది. ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. గోదావరి నది తీరం వెంబడి ఉన్న గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో సౌకర్యాలు కల్పించారు.
Also Read: అమ్మ కోసం దుబాయ్ నుంచి సూట్‌కేసులో టమాటాలు
- Advertisement -