భువనేశ్వర్: దానా తుఫాను ఒడిశా, పశ్చిమ బెంగాల్ లో పంటలను, చెట్లను విధ్వంసం చేసింది. పౌర సేవలకు అంతరాయం కలిగించింది. శుక్రవారం ఉదయం కల్ల నెమ్మదించింది. ఒడిశాలో 7లక్షలకు పైగా జనాలను తీర ప్రాంతాల నుంచి ఖాళీ చేయించారు. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ శుక్రవారం తుఫాను కారణంగా ఎవరూ మరణించలేదని తెలిపారు.
తుఫాను ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాన్ని గురువారం రాత్రి దాటింది. తుఫాను నెలను తాకే ప్రక్రియ దాదాపు 10 గంటలు తీసుకుంది.
ఒడిశాలో ఆరువేల మంది గర్భిణీ మహిళలను ఆరోగ్య కేంద్రాలకు తరలించడం సహా మొత్తం 6లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
తుఫాను నెలను తాకాక ఎన్ డిఆర్ఎఫ్ బలగాలు కేంద్రపాడ, భద్రక్, జగత్సింగ్పూర్ లలో పునరుద్ధరణ పనులు మొదలెట్టారు.
శుక్రవారం ఉదయం నుంచి విమానాల రాకపోకలు, రైళ్ల రాకపోకలు పునరుద్ధరించబడ్డాయి. దీనికి ముందు ఒడిశా, పశ్చిమ బెంగాల్ లకు 200కు పైగా రైళ్లను రద్దు చేశారు.
దానా తుఫాను ఒడిశాలో విద్యుత్తు సరఫరాకు అంతరాయం కలిగించింది. అయితే శుక్రవారం మధ్యాహ్నం నుంచి విద్యుత్తు సరఫరాను పునరుద్ధరించారు. ఒడిశాలో ఉన్న అతిపెద్ద రేవుపట్టణం పారాదీప్ కు ఎలాంటి నష్టం వాటిల్ల లేదు.