Wednesday, January 22, 2025

నేటి రాత్రికి తీరం తాకనున్న దానా తుఫాను!

- Advertisement -
- Advertisement -

దానా తుఫాను నేటి రాత్రి ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీరాన్ని తాకనున్నది. శుక్రవారం తెల్లవారు జామున ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం ఒడిశా రాష్ట్రంలో కురియనున్నది. పశ్చిమ బెంగాల్ కు కూడా దానా తుఫాను భారీ వర్షాన్ని తేనున్నది. తుఫానును ఎదుర్కొనడానికి సన్నద్ధంగా ఉన్నామని ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తెలిపారు. ‘డేంజర్ జోన్’ లో 30 శాతం లేక 3 నుంచి 4 లక్షల మందే ఉన్నారని, మిగతా వారిని ఖాళీ చేయించామని తెలిపారు.

దానా తుఫాను నేలను తాకే సమయంలో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచనున్నాయని ఐఎండి డిజి మృత్యుంజయ మోహపాత్ర తెలిపారు. తీవ్ర గాలి, వర్షం నేటి రాత్రి నుంచి అక్టోబర్ 25 వరకు ఉంటాయని ఆయన తెలిపారు. దానా తుఫాను నేటి రాత్రి నుంచి ఒడిశాకు తీవ్ర నష్టం చేకూర్చొచ్చని భావిస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News