Sunday, December 22, 2024

‘దానా’ తుఫాను శుక్రవారం ఒడిశా తీరాన్ని తాకనుంది: ఐఎండి

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్:  దానా తుఫాను వస్తున్నందున ఒడిశా, పశ్చిమ బెంగాల్ ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నాయి. లోతట్టు ప్రాంతాల నుంచి నివాసితులను ఖాళీ చేయించడం, విద్యా సంస్థలను మూసేయడం చేస్తున్నారు. రెండు రాష్ట్రాలలోనూ భారీ వర్షాలు కురుస్తున్నందున ఎలాంటి అత్యవసర పరిస్థితుల్లోనైనా త్వరగా స్పందించేందుకు భారత తీర రక్షక దళం సన్నద్ధంగా ఉంది. నౌకలు, విమానాలను సిద్ధంగా ఉంచింది.

పూరీ నుంచి పశ్చిమ బెంగాల్ వరకు తూర్పు తీరంపై తుపాను ప్రభావం ఉండనుందని భారత వాతావరణ శాఖ(ఐఎండి) డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్ర తెలిపారు.

దానా తుఫాను అక్టోబరు 25 తెల్లవారుజామున పూరీ , సాగర్ ద్వీపం మధ్య తీరం దాటుతుందని అంచనా. గాలులు గంటకు 100-110 కి.మీ వేగంతో వీచే అవకాశం ఉంది, ఈదురు గాలులు గంటకు 120 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News