Wednesday, November 20, 2024

బంగాళాఖాతంలో ‘దానా’ తుపాను

- Advertisement -
- Advertisement -

బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం క్రమంగా బలపడి వాయుగుండంగా, ఆపై తుపానుగా మారనుందని చెన్నైలోని ప్రాంతీయ వాతావరణ సంస్థ (ఆర్ఎంసి) వెల్లడించింది. ఈ తుపానుకు ‘దానా’ అని నామకరణం చేసినట్టు తెలిపింది. రాగల 24 గంటల్లో ఉత్తర అండమాన్ సముద్రాన్ని ఆనుకుని తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుందని ఆర్ఎంసి వివరించింది. ఇది వాయవ్య దిశగా పయనించి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశిస్తుందని పేర్కొంది. కాగా, ఈ అల్పపీడనం అక్టోబరు 22 నాటికి వాయుగుండంగా, అక్టోబరు 23 నాటికి తుపానుగా మారే అవకాశం ఉన్నట్టు భారత వాతావరణ సంస్థ (ఐఎండి) వెల్లడించింది.

ఈ నెల 25న కోస్తాంధ్ర, యానాంలో అక్కడక్కడ అతి భారీ వర్షాలు… ఈ నెల 20, 24 తేదీల్లో కోస్తాంధ్ర, యానాంలో కొన్నిచోట్ల భారీ వర్షాలు… ఈ నెల 20న రాయలసీమలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండి వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News