- Advertisement -
చెన్నై: ఫెంగల్ తుఫాను తీరాన్ని సమీపిస్తున్న సందర్భంగా తమిళనాడు, పాండిచ్చేరి అధికారులు అప్రమత్తం అయ్యారు. శనివారం మధ్యాహ్నం కల్లా పాండిచ్చేరి నేలను తాకవచ్చని భావిస్తున్నారు. ఈ సందర్భంగా గంటకు 70 నుంచి 90 కిమీ. వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ లలోని కొన్ని ప్రాంతాల్లో, ముఖ్యంగా కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని కూడా పేర్కొంది. తమిళనాడు దాదాపు 4153 మత్య్స పడవలను సిద్ధంగా ఉంచింది. అంతేకాక 2229 రిలీఫ్ క్యాంప్ లను ఏర్పాటు చేసింది. నాగపట్నం, మయిలాదుతురై, కడలూర్, చెన్నైలలో జాతీయ విపత్తు దళాలను సిద్ధంగా ఉంచారు.
- Advertisement -