- Advertisement -
తమిళనాడులో ఫెంగల్ తుపాన్ బుధవారం ఉదయం నుంచి బీభత్సం సృష్టిస్తోంది.మైలాదుత్తురై జిల్లా కేంద్రంలో ఓ పాత భవనం తుపాణ్ దెబ్బకు కుప్ప కూలింది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వాతావరణ శాఖ ఎల్లో అరెర్ట్ జారీ చేసింది. బంగాళా ఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ తమిళనాడు,శ్రీలంక, తీరాల వైపు పయనిస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రం లోని 15 జిల్లాల్లో కాలేజీలు, స్కూళ్లకు రెండు రోజుల పాటు సెలవు ప్రకటించారు.
- Advertisement -