భువనేశ్వర్: జవాద్ తుపాను శనివారం ఉదయానికి ఒడిశా-ఆంధ్ర ప్రదేశ్ కోస్తాను తాకే అవకాశం ఉంది. ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 530 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన జవాద్ తుపాను శనివారం ఉదయానికి పూరీ జిల్లాలో తీరాన్ని తాకుతూ బంగాళాఖాతం వైపు పయనించవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక సహాయ అధికారి పికె జేనా శుక్రవారం తెలిపారు. భారత వాతావరణ శాఖ అందచేస్తున్న సమాచారం ప్రకారం తుపాను పూరీ కోస్తాను తాకుతూ సముద్రంలోకి మరలిపోయే అవకాశం ఉందని ఆయన చెప్పారు. తీరానికి దగ్గరయ్యే కొద్దీ గాలుల తీవ్రత అధికమవుతుందని, గంటకు 90-100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని ఆయన చెప్పారు. ఒడిశా తీరాన్ని తాకిన తర్వాత గాలుల తీవ్రత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ఆయన తెలిపారు. తుపాను తన దిశను మార్చుకుని ఒడిశా తీరాన్ని దాటకుండా తీరాన్ని తాకుతూ ముందుకు సాగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. అన్ని కోస్తా జిల్లాలలో ముఖ్యంగా గంజాం, పూరి, జగత్‌సింగ్ పూర్‌లో ఎటువంటి ప్రాణనష్టం జరగకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయని ఆయన చెప్పారు.
పూరిలో తీరాన్ని తాకనున్న జవాద్ తుపాను
- Advertisement -
- Advertisement -
- Advertisement -