Saturday, November 16, 2024

వాన మబ్బులు

- Advertisement -
- Advertisement -

మన ముసురు ముసుగులో తెలంగాణ వణుకుతోంది. ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఆకాశంలో కారుమబ్బులు కమ్మకున్నాయి. ఒకవైపు ఈశాన్య భారతం నుంచి వస్తున్న చలిగాలులతో ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. దిగువస్థాయిలో చలిగాలులు తూర్పు అగ్నేయ దిశల రాష్ట్రం వీస్తున్నాయి. న్ ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు ముసురు ప ట్టి ఆదివారం రాష్ట్రంలోని ప లు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిశాయి. తుపాను తుంపర్లతో జనం ఇళ్లు విడిచి బయటకు వచ్చేందుకు జంకాల్సి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో ఉదయం నుంచే చిరుజల్లులు పడుతున్నాయి. హైదరాబాద్‌లో అత్యధికంగా 1.8 మి.మి వర్షపాతం నమోదయింది.

ఖమ్మంలో 0.5, మహబూబన్‌నగర్‌లో 0.2, దుండిగల్ , హకీంపేటలో 0.2మి.మి వంతున వర్షపాతం నమోదయింది. ఇదిలాఉంటే చలి తీవ్రత రోజురోజుకూ పెరుగుతూ వస్తోంది. రాష్ట్రంలోని ప లు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి ప డిపోతున్నాయి. ఆదివారం రాష్ట్రంలోని హనుమకొండలో అత్యల్పంగా 14డిగ్రీలకు పడిపోయింది. మెదక్‌లో 17డిగ్రీలు, హకీంపేటలో 18.9 హూగీలు,ఆదిలాబాద్‌లో హైదరాబాద్‌లో హూగీలు, 20 డిగ్రీలు, నిజామాబాద్‌లో 20.5డిగ్రీలు, రా మగుండంలో 20, నల్లగొండలో 17, మహబూబ్‌నగర్‌లో 21.5, ఖమ్మంలో 20.6, భద్రాచలంలో 24 హూగీల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం బలహీనపడింది.

ఉద యం తీవ్ర అల్పపీడనంగా మారిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో తెలంగాణలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒకమోస్తరు వర్షాలు కురిసినట్టు తెలిపింది. సోమవారం ఉరుములులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు తెలిపింది. అదే విధంగా రాగల మూడు రోజులపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News