Saturday, November 23, 2024

మాండౌస్ తుఫాను అర్ధ రాత్రి మామల్లాపురంను తాకనుంది!

- Advertisement -
- Advertisement -

చెన్నై: మాండౌస్ తుఫాను ఈ రోజు అర్ధరాత్రి ఉత్తర తమిళనాడు తీరంలోని మామల్లాపురంను తాకనున్నది. ఈదురు గాలి గంటకు 85 కిమీ. వేగంతో వీచనున్నది. బలమైన గాలులతోపాటు భారీ వర్షం కురియనున్నది. చెన్నైలో పాఠశాలలు, కళాశాలలకు నేడు సెలవు ప్రకటించారు. చెట్ల కింద వాహనాలు నిలుపొద్దని సూచించారు. ప్రస్తుతం తుఫాను చైన్నై ఆగ్నేయంగా 350 కిమీ. దూరంలో ఉంది. అది గంటకు 60 కిమీ. వేగంతో చైన్నై వైపుకు దూసుకొస్తోంది.

కాంచీపురం, చెంగల్పట్టు, విల్లుపురం జిల్లాలు, పుదుచ్చేరి ప్రాంతంలో భారీ వానలు కురవొచ్చని తెలుస్తోంది. కాగా తిరువల్లూరు, చెన్నై, రాణిపేట్, వెల్లూరు, తిరుపత్తూరు, తిరువన్నామళై, కల్లకురిచి, కడలూరు జిల్లాల్లో కూడా భారీ వానలు కురిసే సూచనలున్నాయి. ధర్మపురి, సేలం, నమక్కల్, తిరుచిరాపల్లి, పెరంబలూరు, అరియలూరు, మైలాడుతురై, నాగపట్నం, తిరువారూర్, పుదుకోటై, కరూర్, దిండిగల్, మధురై, శివగంగ జిల్లాలో కూడా పెద్ద ఎత్తున వానలు కురిసే అవకాశముంది.
డిసెంబర్ 10న కూడా ఒకటి రెండు చోట్ల భారీ వానలు కురియొచ్చు. పర్యాటక స్థలాలను మూసి ఉంచాలని పుదుచ్చేరి ప్రభుత్వం ఇప్పటికే ఉత్తర్వులు జారీచేసింది. ఇప్పటికే బొటానిక్ గార్డెన్స్, భారతి పార్క్ మూసేశారు. నోనన్‌గుప్పం సహా పుదుచ్చేరిలోని ప్రధాన పర్యాటక స్థలాలను మూసి ఉంచాలని ఉత్తర్వులు జారీచేశారు. చాలా ప్రాంతాల్లో ఇప్పటికే విద్యుత్తు అంతరాయాలు ఏర్పడుతున్నాయి.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News