Wednesday, January 22, 2025

తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ కు ‘మాండౌస్’ తుఫాను

- Advertisement -
- Advertisement -
తమిళనాడు, పుదుచ్చేరి,  ఆంధ్రా జిల్లాలో భారీ వర్షాలకు అవకాశం
తీరానికి చేరగానే తుఫాను బలహీనపడనున్నది

చెన్నై: దక్షిణ అండమాన్ సముద్రం, దాని పరిసరాల్లో సోమవారం ఏర్పడిన అల్పపీడనం డిసెంబర్ 7 నాటికి  ‘మాండౌస్’ తుఫానుగా మారనుంది. ఈ తుఫానుకు  ‘మాండౌస్’ అన్న పేరును యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్( యూఏఈ) పెట్టింది.   ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ వైపు గురువారం కదులుతుందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దాంతో ఈ ప్రాంతాల్లో భారీ వర్షం కురియవచ్చని హెచ్చరించింది. అంతేకాక గురు, శుక్రవారం రోజులకు ‘ఆరెంజ్ అలర్ట్’ ను ( అంటే ‘సిద్ధంగా ఉండండి’) ప్రకటించింది.  ఈ హెచ్చరికకు అనుగుణంగా తమిళనాడు ఆరు జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం బృందాలను మోహరించినట్లు అధికారిక ప్రకటనను ఉటంకిస్తూ ఏఎన్‌ఐ వార్తా సంస్థ పేర్కొంది.

వాతావరణ శాఖ ప్రకారం మంగళవారం ఓ మోస్తరు వానలు తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్‌లో పడొచ్చు. కాగా బుధవారం అర్ధ రాత్రి నుంచి భారీ వర్షాలు పడొచ్చని, రాగల మూడు రోజుల్లో తుఫాను విధ్వంసం సృష్టించొచ్చని హెచ్చరించింది. ‘అయితే తీరానికి చేరుకోగానే తుఫాను బలహీనపడే సూచనలున్నాయని నిపుణులు తెలిపారు’ అని స్కైమెట్ వెదర్ సర్వీసెస్ ఉపాధ్యక్షుడు మహేశ్ పలావత్ తెలిపారు. “కానీ తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీరంలో డిసెంబర్ 7,8 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది’ అని ఆయన తెలిపారు. తమిళనాడులోని చెంగల్‌పట్టు, కాంచీపురం, తిరువళ్లూర్, చెన్నై, అరియలూర్, తంజావూర్, నాగపట్నం ప్రాంతాల్లో భారీ వానలు కురవొచ్చు, కాగా రాణిపేట్, వెల్లూరు, శివగంగ, తిరుచిరాపల్లి, తిరుపత్తూర్, తిరువన్నామలయ్ తదితర ప్రాంతాల్లో ఓ మోస్తరు వానలు పడనున్నాయని తెలిపారు.

వీటికి తోడు ‘కృష్ణగిరి, ధర్మపురి, సేలం, కడలూరు, నమక్కల్, ఈరోడ్’ వంటి తమిళనాడులోని కొన్ని జిల్లాల్లో, పుదుచ్చేరి ప్రాంతంలో శుక్రవారం అత్యంత భారీ వానలు పడొచ్చని వాతావరణ శాఖ హెచ్చరించింది.
అండమన్ సముద్ర ప్రాంతంలో, బంగాళాఖాతంలోని కొన్ని భాగాల్లో, తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల్లో తదుపరి కొన్ని రోజులు వాతావరణం అల్లకల్లోలంగా ఉండనుందని హెచ్చరించారు. ఇంతేకాక మత్సకారులు సముద్రంలోకి చేపల వేటకు వెళ్లొద్దని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News