Wednesday, January 22, 2025

డిసెంబర్ 9 అర్ధరాత్రి తమిళనాడును దాటనున్న ‘మాండౌస్’ : ఐఎండి

- Advertisement -
- Advertisement -

పంబన్(తమిళనాడు): బంగాళా ఖాతంలో ఏర్పడిన వాయుగుండం ‘మాండౌస్’ తుఫానుగా రూపాంతరం చెందింది. అది డిసెంబర్ 9 అర్ధరాత్రి తమిళనాడు, పుదుచ్చేరిలను దాటొచ్చని వాతావరణ శాఖ గురువారం తెలిపింది. “సైక్లోన్ స్టార్మ్ పశ్చిమబెంగాల్ ఈశాన్యంలో 500 కిమీ. దూరంలో కరైకాల్ లో కేంద్రీకృతమై ఉంది. అది తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్ దక్షిణ తీరం వైపుకు కదులుతోంది. డిసెంబర్ 9న అర్ధరాత్రి గంటకు 70 కిమీ. వేగంతో తుఫాను గాలులు వీచే అవకాశం ఉంది” అని వాతావరణ శాఖ (ఐఎండి) గురువారం మధ్యాహ్నం ట్వీట్ చేసింది. అంతేకాక తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి పసుపు రంగు హెచ్చరికను కూడా జారీ చేసింది. రామేశ్వరంకు చెందిన పంబన్ రేవు వద్ద తుఫాను గురించి మత్యకారులకు హెచ్చరికను జారీ చేశారు. సముద్రంలోకి వెళ్లొద్దని అప్రమత్తం చేశారు.

 

NDF

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News