Thursday, January 23, 2025

బాపట్ల వద్ద తీరం దాటిన మిగ్‌జాం తుఫాన్…. వీడియోలు వైరల్

- Advertisement -
- Advertisement -

చెన్నై: తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో మిగ్‌జాం తుఫాన్ బీభత్సం సృష్టించింది. మిగ్‌జాం తుఫాన్ ధాటికి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తీర ప్రాంతాలలో భారీ ఈదురుగాలులతో వర్షం కురువడంతో లోతట్టు ప్రాంతాలు జలమయంగా మారాయి. చెన్నైలో రోడ్లన్నీ జలమయంగా మారడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. కార్లు, ద్విచక్రవాహనాలు వరదలలో కొట్టుకొనిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చెన్నైలోని విమానాశ్రయంలో నీటిలో మునిగిపోయింది.

ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల సమీపంలో మిగ్‌జాం తుపాన్ తీరాన్ని తాకింది. తీరం దాటక స్వల్పంగా తుఫాన్ బలహీనపడనుంది. సాయంత్రానికి వాయుగుండం కూడా బలహీనపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుమలలో జలాశయాలు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరాయి. కుమారధార, పసుపుధార, కల్యాణి జలాశయాలు పూర్తిగా నిండాయి. తిరుమల గిరుల నుంచి వస్తున్న వరదతో మాల్వాడిగుండం పోటెత్తింది. మాల్వాడిగుండం జలపాతం ఉధ్ధృతితో పలు కాలనీలు స్కావెంజర్ కాలనీ, గొల్లవానిగుంట, ఆటోనగర్‌లాంటి కాలనీలు నీటిలో మునిగిపోయాయి.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News