సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి : రేవంత్‌రెడ్డి
మన తెలంగాణ/హైదరాబాద్ : మిగ్‌జాం ఎఫెక్ట్.. సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని పిసిసి చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు. బంగాళా ఖాతంలో ఏర్పడిన తీవ్ర తుపాను ప్రభావంతో ఉత్తర, దక్షిణ తెలంగాణా జిల్లాలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ట్వీట్ చేశారు. వరిధాన్యం తడిసిపోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జనజీవనానికి ఇబ్బంది కలుగకుండా చూడాలని తెలిపారు. అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని రేవంత్ పునరుద్ఘాటించారు.
తెలంగాణలో పలు జిల్లాలలో తుఫాను ప్రభావంపై ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలి.
వరి ధాన్యం తడిచిపోకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
ఏజెన్సీ, లోతట్టు ప్రాంతాల్లో జన జీవనానికి ఇబ్బంది కలుగకుండా చూడాలి.
అవసరమైన సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలి.
— Revanth Reddy (@revanth_anumula) December 5, 2023