Monday, January 20, 2025

నగరంలో తగ్గిన రాజకీయ వేడి.. పెరిగిన చలి

- Advertisement -
- Advertisement -

మిచాంగ్ తుఫాన్‌తో పెరిగిన చలి

హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజకీయ వేడితో ఆది వారం వరకు అట్టుడిక్కిన హైదరాబాద్ నగరం మిచాంగ్ తుఫాన్‌తో ఒక్కసారిగా చల్లబడింది. దీంతో నగరం చలితో గజ గజ వణుకుతోంది. అసలే చలికాలం కావడంతో ఒకవైపు చలి తీవ్రత పెరుగుతుండగా మరో వైపు మిచాంగ్ తుఫాన్ తీవ్ర తుఫాన్‌గా మారడంతో ఒక్కసారిగా నగరంలో వాతావరణ పూర్తిగా చల్లబడిపోయింది. దీంతో సోమవారం ఉదయం నుంచి నగరాన్ని పూర్తిగా మబ్బులు కమ్మి వేయడంతో పాటు చలు గాలులు వీచాయి.

దీనికి తోడు అక్కడక్కడ చిరు జల్లులు మొదలు మోస్తారు వర్షం కురువడంతో గరిష్ట ఉష్ణోగత్రలు పడిపోవడంతో ఒక్కసారిగా చలి తీవ్రత పెరిగింది. రోజు వారిగా గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే 5 నుంచి 6 డిగ్రీలు తక్కువ నమోదు కావడంతో నగరవాసులు చలితో ఉదయం నుంచే తీవ్ర ఇబ్బందులు పడ్డారు. సాయంత్రానికి ఉష్ణాగత్ర మరింత క్షీణించడంతో 4 గంటల తర్వాత చాల మందికి ఇళ్లకే పరిమితమైయ్యారు. ముఖ్యంగ వయోవృద్దులు, చిన్నారులు చలి కారణంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు .మరోవైపు పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో పాటు సాయంత్ర వేళా ఉద్యోగులు చలితో కష్టాలు పడ్డారు. చల్లటి వాతావరణానికి తోడు అక్కడక్కడ వవర్షం కూడ కురవడంతో మరింత ఇబ్బందులు పడ్డారు.

పెరుగుతున్న చలి తీవ్రత 
డిసెంబర్ ప్రవేశిచండంతో నగరంలో చలి అంతకు అంతా పెరుగునుంది. ప్రతి ఏటా డిసెంబర్ రెండవ వారం నుంచి చలి తీవ్రత పె రుగుతుండం సహజం . అయితే మిచాంగ్ తుఫాన్ కారణంగా మొదటి వారం నుంచే చలి తీవ్రత ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో పగటి ఉష్ణాగ్రతలతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు సైతం ఒక్కసారి పడిపోయ్యాయి. తుఫాన్ ప్రభావం మరో మూడు రోజుల వరకు ఉండనుండడంతో మొదటి వారంలోనే చలి తీవ్రత మరింత పెరిగింది.

నగరంలో రెండు రోజుల పాటు వర్షం 
మిచాంగ్ తుఫాన్ కారణంగా నగరంలో రెండు రోజుల పాటు వర్షం కురిసే అవకాశం ఉన్నటుల వాతావరణ శాఖ ప్రకటించింది. నేటి మధ్యాహ్నాం ఆంధ్రప్రదేశ్‌లోని బాపట్ల ప్రాంతంలో తీరం దాటనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించారు. దీంతో నగరంలో 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలులు వీయడంతో పాటు పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు వెల్లడించారు .దీంతో నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని జిహెచ్‌ఎంసి, ఈవిఎండి అధికారులు నగరవాసులకు విజ్ఞప్తి చేశారు. వర్షాల వేళా అవసరముంటే తప్ప బయటికి రావద్దని సూచించారు. మరోవైపు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికల నేపథ్యంలో జిహెచ్‌ఎంసి అప్రమత్తమైంది. అత్యవసర సహాయక బృందాలు పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని ఉన్నతాధికారులు అదేశాలు జారీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News