Saturday, January 11, 2025

మయన్మార్‌లో విధ్వంసం సృష్టించిన మోచా తుఫాను!

- Advertisement -
- Advertisement -
సిట్వే టౌన్‌షిప్ వంటి ఎతైన ప్రదేశాలలో, దృఢమైన భవనాలలో, మఠాలు, గోపురాలలో ఆశ్రయం పొందిన 20000 మందిలో 700కు పైగా గాయపడ్డారు.

రాఖైన్: పశ్చిమ మయన్మార్ తీరంలో 3.6 మీటర్ల(12 అడుగుల) లోతు సముద్రపు నీటిలో చిక్కుకున్న 1000 మంది వ్యక్తులను మే 15న రక్షకులు ఖాళీ చేయించారు. శక్తిమంతమైన మోచా తుఫాను వందలాది మందిని గాయపరిచింది. ఆసియా ఖండంలో అత్యల్ప అభివృద్ధి చెందిన దేశమైన మయన్మార్‌లో వందలాది మంది గాయపడ్డారు. కమ్యూనికేషన్ వ్యవస్థను ఆపేశారు. నష్టం ఎంత, మృతుల సంఖ్య ఎంత అనేది తెలియదు.

బలమైన గాలులు వల్ల సుమారు 20000 మంది వ్యక్తులలో 700 మందికిపైగా గాయపడ్డారని, వారంతా సిట్వే టౌన్‌షిఫ్‌లోని ఎత్తైన ప్రదేశాలలో మఠాలు, పగోడాలు, పాఠశాలల్లో ఆశ్రయం పొందారని సిట్వేలోని రాఖైన్ యూత్ ఫిలాంత్రోపిక్ అసోసియేషన్ నాయకుడు తెలిపారు. ఆయన తన పేరు వెల్లడించడానికి నిరాకరించారు. సైనిక పాలనలో ఉన్న అధికారులు ప్రతీకారం తీర్చుకుంటారని ఆయన తన భయాన్ని వ్యక్తం చేశారు. మయన్మార్‌లోని 10 లోతట్టు ప్రాంతాల్లో సముద్రపు నీరు చేరింది.
మోచా తుఫాను మయన్మార్‌లోని రాఖైన్ రాష్ట్రంలో నేలను తాకింది. ఆదివారం సాయంత్రం 4.00 గంటలకు తుఫాను నేలను తాకింది. వరద నీరు వెనక్కి వెళ్లలేదు. చాలా మంది ప్రజలు ఇండ్ల కప్పులు, ఎత్తైన ప్రదేశాలలోనే కూర్చున్నారు. రాత్రంతా ఈదురు గాలలు వీచాయి. ఇప్పటికీ 1.5 మీటర్ల(5 అడుగుల) వరద నీరు నిలిచే ఉంది. మయన్మార్‌లో కనీసం ముగ్గురు చనిపోయారని తెలిసింది. కానీ ఎంత అనేది ఇంకా నిర్ధారణ కాలేదు. మయన్మార్‌కు పొరుగు ఉన్న బంగ్లాదేశ్‌లో అనేక మంది గాయపడ్డారని సమాచారం. వాస్తవానికి బంగ్లాదేశ్ నేలను తాకుతుందనుకున్న మోచా తుఫాను చివరికి మయన్మార్‌ను తాకింది.

Mocha-Cyclone-5

Mocha-Cyclone2

Mocha-Cyclone-3

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News