Friday, November 22, 2024

ఆదివారం నేలను తాకనున్న మోచా తుఫాను!

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: మోచా తుఫాను హిందూ మహాసముద్రంపై ఏర్పడుతున్న సీజన్‌లో తొలి తుఫాను. ఇది బంగాళాఖాతంపై తన రూపాన్ని సంతరించుకుంటోంది. ‘చాలా తీవ్రమైన తుఫాను’గా మారనున్నదని భావిస్తున్నారు. వాతావరణ కార్యాలయం ప్రకారం, మోచా తుఫాను ఆదివారం (మే 14న) బంగ్లాదేశ్‌-మయన్మార్ సరిహద్దులో ఎక్కడో ఒక చోట ఇది తీరాన్ని తాకే అవకాశం ఉంది. మోచా తుఫాను పురోగమిస్తున్నందన అనేక రాష్ట్రాలు, పశ్చిమ బెంగాల్‌లో భారీ వర్షాలు పడొచ్చని తెలుస్తోంది.
మోచా తుఫాను ఆదివారం నాటికి బంగ్లాదేశ్‌లోని కాక్స్ బజార్, మయన్మార్‌లోని ఓడరేవు నగరం సిట్వేకి సమీపంలో ఉన్న క్యుప్యు మధ్య తీరాన్ని తాకుతుందని అంచనా. కాక్స్ బజార్‌లో 9లక్షలకు పైగా రొహింగ్యా ముస్లింలు కాందీశీక శిబిరాల్లో ఉన్నారు. కాగా భారత దేశంలోని ఈశాన్య ప్రాంతాలు కూడా మోచా తుఫాను ప్రభావానికి లోను కానున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News