న్యూఢిల్లీ: బంగాళాఖాతంలో ‘యాస్’ తుపాన్ కలకలం రేపుతోంది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. రాకాసి యస్ తుపాన్ దేశంలోని పలు రాష్ట్రాల్లోకి దూసుకొస్తుంది. నేడు మరింత బలపడి తీవ్రవాయుగుండం మారనుందని వాతావరణ శాఖ ప్రకటించింది. రేపటికి అతి తీవ్రతుఫానుగా మారనుందని ఐఎండి వెల్లడించింది. ఈ నెల 26 సాయంత్రానికి ఒడిశా-బెంగాల్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని పేర్కొంది. ఒడిశా పారదీప్, బెంగాల్ సాగర్ ద్వీపం మధ్య తీరం దాటే అవకాశముందని అధికారులు తెలిపారు. ఒడిశా, బెంగాల్ పై యస్ తుఫాన్ ప్రభావం అధికంగా ఉండనుంది. మే నెల 25-27 మధ్య ఒడిశా, బెంగాల్, సిక్కింలో వర్షాలు పడనున్నట్టు వాతావరణ అధికారులు తెలిపారు. యస్ తుఫాన్ హెచ్చరికలతో ఒడిశా, బెంగాల్ ప్రభుత్వాలు అప్రమత్తం అయ్యాయి. మత్య్సకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరించారు. యస్ తుఫాన్ సన్నద్ధతపై ఆదివారం ప్రధాని నరేంద్ర మోడీ ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. సకాలంలో ప్రజల్ని తరలించాలని అధికారులను ప్రధాని ఆదేశించారు. యస్ తుఫాన్ ప్రభావం తెలుగు రాష్ట్రాలపై పరిమితంగానే ఉంటుందని ఐఎండి ప్రకటించింది.
Cyclone Yaas live tracking news