Wednesday, November 6, 2024

తూర్పుతీరానికి ముంచుకొస్తున్న గులాబ్

- Advertisement -
- Advertisement -

Cyclonic Storm form in Bay of Bengal

3రోజుల పాటు భారీ వర్షాలు
వాయుగుండంగా మారిన అల్పపీడనం, తుపానుగా బలపడే అవకాశం
ఉత్తర తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరిక

న్యూఢిల్లీ : దేశ తూర్పు తీర ప్రాంతానికి గులాబ్ తుపాన్ ముప్పు తలెత్తనుంది. దీనికి సంబంధించి శనివారం కోల్‌కతాలోని వాతావరణ పరిశోధనా సంస్థ (ఐఎండి) హెచ్చరికలు వెలువరించింది. బంగాళాఖాతంలో ఉత్తర, తూర్పుమధ్య ప్రాంతాలకు సమీపంలో తీవ్రస్థాయి అల్పపీడనం నెలకొంది, తరువాత వాయుగుండంగా మారింది. ఇది వచ్చే 12 గంటలలో సైక్లోన్‌గా మారుతుందని పేర్కొన్న వాతావరణ విభాగం సంబంధిత విషయంపై ఎల్లో అలర్ట్ వెలువరించింది. ఇప్పుడు రాబోయే తుపాన్‌కు గులాబ్ సైక్లోన్‌గా పిలుస్తున్నారు. దీని ప్రభావంతో ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలలో ఎక్కువగా తెలంగాణలో కొంత మేర వర్షాలు పడుతాయని సూచనలు వెలువరించారు. తెలుగురాష్ట్రాలలో ప్రత్యేకించి తెలంగాణలో చాలారోజుల భారీ తేమతో కూడిన వాతావరణం వీడి ఇప్పుడిప్పుడే ఎండ పొడి వాతావరణం ఏర్పడుతోంది.

అయితే ఇప్పటి తుపాన్ ప్రభావం ఇక్కడ కూడా ఉంటుందని వెల్లడైంది. ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని తుపాన్ నేపథ్యంలో ప్రత్యేకించి ఒడిశా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు హెచ్చరికలు వెలువరించారు. శనివారం వెలువరించిన తాజా బులెటిన్‌లో ఇప్పుడు బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఇప్పుడు బలోపేతం అయి గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమదిశకు వెళ్లుతోందని వివరించారు. ఇది క్రమేపీ తుపాన్‌గా మారుతుంది. ఇప్పుడు సముద్రంలో నెలకొన్న వాయుగుండం ఒడిశాలోని గోపాల్‌పూర్‌కు 510 కిలోమీటర్ల వాయవ్యం, ఆంధ్రప్రదేశ్‌లోని కళింగపట్నంకు 590 కిలోమీటర్ల తూర్పు, ఈశాన్య దిశలో కేంద్రీకృతం అయి ఉంది.

ఇది తుపాన్‌గా మారి పశ్చిమ దిశకు పయనించి ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల వెంబడి విశాఖపట్టణం, గోపాల్‌పూర్ దాదాపుగా కళింగపట్నం మధ్య ఆదివారం సాయంత్రానికి తీరం దాటుతుంది. తుపాన్ హెచ్చరికలతో జాతీయ విపత్తు నిర్వహణ దళం (ఎన్‌డిఆర్‌ఎఫ్) ఇప్పటికే దాదాపుగా 15 బృందాలను తీర ప్రాంత జిల్లాలకు అత్యవసర ప్రాతిపదికన పంపించింది. తుపాన్ ప్రభావంతో కోస్తాంధ్ర, ఒడిశా తీర ప్రాంత జిల్లాల్లో శనివారం, ఆదివారం భారీ వర్షాలు పడుతాయి. శని, ఆదివారాలలో గంటకు 70 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయి. సోమవారం ఇవి గంటకు దాదాపు 90 కిలోమీటర్ల వేగంతో ప్రభావం చూపుతాయని, ఈ రెండు మూడు రోజులూ మత్సకారులు సముద్రంలోకి వెళ్లవద్దని వాతావరణ శాఖ ఇప్పటి హెచ్చరికలలో తెలిపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News