Sunday, January 19, 2025

తుపానుగా మారిన వాయుగుండం

- Advertisement -
- Advertisement -

తెలంగాణలో పొడివాతావరణం

మనతెలంగాణ/హైదరాబాద్:  బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన వాయుగుండం ‘మైథిలీ’ తుపానుగా మారిందని ఇది ఉత్తర దిశగా పయనిస్తున్నట్టు ఐఎండి వెల్లడించింది. దక్షిణాదిన సముద్ర తీర ప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చిరించింది. వాయుగుండం క్రమంగా బలహీనపడి బంగ్లాదేశ్ సమీపాన తీరం దాటే అవకాశం ఉన్నట్టు తెలిపింది. ఇప్పటికే తమిళనాడుతో పాటుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కోస్తా జిల్లాల్లో ఒక మోస్తరు వర్షాలు పడుతున్నట్టు తెలిపింది. మరోవైపు కిందిస్థాయిలో గాలులు ఉత్తర , ఈశాన్య దిశల నుంచి తెలంగాణ రాష్ట్రం వైపునకు వీస్తున్నాయి. తెలంగాణలో రాగల రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

 

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News