Friday, December 27, 2024

టోలీచౌకిలో సిలిండర్ల పేలుడు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: వెల్డింగ్ వర్కషాప్‌లో పేలుడు సంభవించిన ఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని టోలీచౌకిలో ఆదివారం చోటుచేసుకుంది. టోలీచౌకీలోని వెల్డింగ్ వర్క్‌షాప్ వద్ద ఎల్‌పిజి గ్యాస్‌సిలిండర్ల నుంచి చిన్న సిలిండర్లకు గ్యాస్ నింపుతున్నారు. ఈ క్రమంలోనే మూడు సిలిండర్లను నింపుతుండగా పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో ఎవరికి గాయాలు కాలేదు. విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News