Friday, January 3, 2025

మలక్‌పేటలో అగ్నిప్రమాదం.. ఒకరి మృతి

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, హైదరాబాద్ : గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఓ కార్మికుడు మృతిచెందిన సంఘటన మలక్‌పేటలోని సోహైల్ హోటల్‌లో శుక్రవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. మలక్‌పేటలోని సోహైల్ హోటల్ కిచెన్‌లో సాయంత్రం సిలిండర్ పేలడంతో అగ్నిప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి భవన శిథిలాలు హోటల్‌లో పనిచేసే కార్మికుడు షాబుద్దిన్(34)పై పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.

కిచెన్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో హోటల్‌లో ఉన్న దాదాపుగా 50మంది బయటికి పరుగు తీశారు. దట్టంగా పొగ అలముకోవడంతో ఆ ప్రాంతం పొగతో నిండిపోయింది. హోటల్ సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రి వరకు పొగ వ్యాపించడంతో రోగులు, వారి సహాయకులు ఊపిరి ఆడక బయటికి పరుగుతీశారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనస్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదం జరిగిన హోటల్‌ను స్థానిక ఎమ్మెల్యే అహ్మద్ బలాలా, ఎసిపి దేవేందర్ పరిశీలించారు. విద్యుదాఘాతమా లేక గ్యాస్ లీకేజీ కారణమా అనే దానిపై విచారణ చేస్తున్నామని జిల్లా అగ్నిమాక అధికారి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News