Saturday, November 23, 2024

సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం..

- Advertisement -
- Advertisement -

పెగడపల్లిః మండలంలోని రాజారాంపల్లి గ్రామంలో బండారి కనకయ్య ఇంట్లో ప్రమాదవశాత్తు సిలిండర్ పేలడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది. ఇంట్లో వారందరూ ఉదయం వ్యవసాయ పనులకు వెళ్లగా మధ్యాహ్నం సమయంలో అనుకోకుండా భారీ శబ్దంతో గ్యాస్ సిలిండర్ పేలినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం లేకపోయినా భారీగా ఆస్తి నష్టం సంభవించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఇంట్లో కనకయ్య కూతురు పెళ్లి కోసం చిట్టి ద్వారా ఎత్తుకున్న రూ.5 లక్షల నగదు, 5 తులాల బంగారం, 30 క్వింటాళ్లపైగా పత్తి, ఇతర సామాగ్రి మొత్తం దగ్దమైంది. దీంతో బాధిత కుటుంబ సభ్యులకు కేవలం కట్టుబట్టలు మాత్రమే మిగిలాయి.

స్థానిక సర్పంచ్ సాయిని సత్తెమ్మ అధికారులకు సమాచారం అందించడంతో హుటాహుటిని రెవెన్యూ, పోలీస్, అగ్ని మాపక శాఖల అధికారులు సందర్శించి పంచనామా నిర్వహించారు. ఈ విషయం మంత్రి కొప్పుల ఈశ్వర్‌కు తెలియజేయగా అసెంబ్లీ సమావేశాల్లో ఉన్న మంత్రి బాధితునికి ఫోన్ చేసి పరామర్శించి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. బాధిత కుటుంబ సభ్యులను సర్పంచ్ సాయిని సత్తెమ్మ, ఉప సర్పంచ్ నాగుల రాజశేఖర్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి తుమ్మల నిఖిల్‌రెడ్డి, ఎంపిటిసి కొత్తపెల్లి రవీందర్, బిఆర్‌ఎస్ మండల శాఖ అధ్యక్షుడు లోక మల్లారెడ్డి, ఉపాధ్యక్షుడు సాయిని రవీందర్, నాయకులు రాజు ఆంజనేయులు, రాకేష్, రాచకొండ ఆనంద్, బండారి కనకయ్య, ఇటిక్యాల కిరణ్‌కుమార్ తదితరులు పరామర్శించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News