కరీంనగర్: హుజూరాబాద్‌లో మాజీ మంత్రి, బిజెపి నేత ఈటెల రాజేందర్ తన స్వార్థం కోసం ఉప ఎన్నికలు తీసుకొచ్చారని ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. హుజూరాబాద్‌లో టిఆర్‌ఎస్‌లోకి చేరికలు కొనసాగుతున్నాయి. మంత్రి హరీష్ రావు సమక్షంలో కెడిసిసి బ్యాంక్ వైస్ చైర్మన్ పింగిళి రమేష్ గులాబీ కండువా కప్పుకున్నాడు. ఈ సందర్భంగా హరీష్ మాట్లాడారు. బిజెపికి ఓటేస్తే గ్యాస్ సిలిండర్ ధర రూ.1500లకు చేరుకుంటుందని, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ బిజెపి అమ్మకానికి పెట్టిందన్నారు. హుజూరాబాద్ ప్రజలు ధర్మం వైపు నిలబడాలని పిలుపునిచ్చారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటెల రాజేందర్ ఒక్క డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు పూర్తి చేసిండా? అని హరీష్ రావు ప్రశ్నించారు. ప్రజలకు ఏం చేశారని బిజెపి నేతలు ఓట్లు అడుగుతున్నారని నిలదీశారు. బిజెపి నేతలు మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఒక వ్యక్తికి లాభం చేయడం కోసం హుజూరాబాద్ ప్రజలు త్యాగం చేయాలా? అని ప్రశించారు. పని చేసి టిఆర్‌ఎస్‌ను గెలిపించుకోవాలన్నారు.
బిజెపికి ఓటేస్తే సిలిండర్ ధర రూ.1500 అవుతుంది: హరీష్ రావు
- Advertisement -
- Advertisement -
- Advertisement -