Saturday, December 21, 2024

రాజ్యసభకు నామినేషన్లు

- Advertisement -
- Advertisement -

దాఖలు చేసిన టిఆర్‌ఎస్ అభ్యర్థులు దామోదర్‌రావు, పార్థసారథి

మన తెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రం నుంచి రెండు రాజ్యసభ స్థానాలకు టిఆర్‌ఎస్ అభ్యర్థులుగా డి. దామోదర్ రావు, పార్థసారథి రెడ్డి నామినేషన్ దాఖలు చేశారు. అసెంబ్లీలో ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు అభ్యర్థులు బుధవారం నామినేషన్ పత్రాలను అందజేశారు. నామినేషన్ కార్యక్రమంలో మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యా దవ్, గంగుల కమలాకర్‌రెడ్డి, మల్లారెడ్డితో పాటు పలువురు ఎంఎఎల్‌ఎలు, పాల్గొన్నా రు. కెప్టెన్ లక్ష్మీకాంతారావు, డి.శ్రీనివాస్ పదవీకాలం జూన్‌లో పదవీకాలం ముగియనుండటం తో ఎన్నిక జరగనుంది. ఈ నెల 31 వరకు నా మినేషన్లు స్వీకరిస్తారు. జూన్ 1న పరిశీలన, 3వ తేదీ వరకు ఉపసంహరణ గడువు ఉంటుంది. జూన్ 10వ తేదీన పోలింగ్ జరగనుంది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News