Sunday, January 19, 2025

మహారాష్ట్ర అసెంబ్లీకి పోటీచేస్తున్న బిజెపి అభ్యర్థుల తొలి జాబితా

- Advertisement -
- Advertisement -

ముంబై: ముంబై అసెంబ్లీ ఎన్నికలు నవంబర్ 20న జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో బిజెపి తన అభ్యర్థుల తొలి జాబితా నేటి మధ్యాహ్నం విడుదల చేసింది. ఈ జాబితాలో 99 మంది పేర్లు ఉన్నాయి.మహారాష్ట్రలో మొత్తం 288 సీట్లు ఉన్నాయి. అందులో బిజెపి తరఫున దాదాపు 160 మంది పోటీ చేయబోతున్నారు. మిగతా సీట్లను శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సిపికి వదిలేశారు. 

బిజెపి నుంచి పోటీ చేస్తున్న అభ్యర్థులలో ప్రముఖులు… మాజీ డిప్యూటీ సిఎం దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కూతురు శ్రీజయ చవాన్, బిజెపి చీఫ్ చంద్రశేఖర్ బవాంకులే, సహాయ మంత్రి సుధీర్ ముంగంటివార్,  కేంద్ర మంత్రి రావుసాహెబ్ దాన్వే కుమారుడు సంతోశ్, సిట్టింగ్ ఎంఎల్ఏ మిహీర్ కొటెచ తదితరులు పోటీ చేస్తున్నారు.

  

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News