Wednesday, January 22, 2025

కేంద్ర, రాష్ట్రాల్లో ఒకే ప్రభుత్వం మేలు: డికె అరుణ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: రాష్ట్రాలు వేగంగా అభివృద్ధి చెందాలంటే కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండాలని బిజెపి జాతీయ ఉపాధ్యక్షురాలు డికె అరుణ అన్నారు. శనివారం కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా బళ్లారి నియోజకవర్గం బిజెపి అభ్యర్థి గాలి సోమశేఖర్ రెడ్డికి మద్దతుగా మాజీ ఎంపి వివేక్ వెంకటస్వామి, బిజెపి శ్రేణులతో పర్యటించారు.

Also Read: టిడిపిలో చేరికపై ఎమ్మెల్యే రాజా సింగ్ క్లారిటీ…

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. వేర్వురు ప్రభుత్వాలు ఉంటే, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేర్చడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారని అన్నారు. కర్ణాటకలో ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని అనడం అది కేవలం మీడియా సృష్టి అని ఆమె కొట్టిపారేశారు. ఢిల్లీలో.. గల్లీలో లేని పార్టీ కాంగ్రెస్‌కు ప్రజలు ఎందుకు ఓటు వేస్తారని ఆమె ప్రశ్నించారు. కర్ణాటక రాష్ట్రంలో మరోసారి బిజెపి జెండా ఎగరడం ఖాయమని బిజెపి నేతలు ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News