Monday, January 20, 2025

మంగళూరు, బెంగళూరు పేలుళ్ల మధ్య లింక్

- Advertisement -
- Advertisement -

బెంగళూరు : బెంగళూరులోని ప్రముఖ రామేశ్వరం కేఫ్‌లో పేలుడుకు, 2022లో మంగళూరులో సంభవించిన కుక్కర్ పేలుడుకు మధ్య లింక్ ఉన్నట్లు కనిపిస్తోందని, పోలీసులు అన్ని కోణాల్లో నుంచి దర్యాప్తు చేస్తున్నారని కర్నాటక ఉప ముఖ్యమంత్రి, పిసిసి చీఫ్ డికె శివ‚కుమార్ శనివారం విలేకరులతో చెప్పారు. నిష్పాక్షిక దర్యాప్తునకు ప్రభుత్వం నిబద్ధమై ఉందని, తూర్పు బెంగళూరు బ్రూక్‌ఫీల్డ్ ప్రాంతంలోని ఈటరీలోని సంఘటనలపై దర్యాప్తు కోసం పోలీసులకు స్వేచ్ఛ ఇచ్చామని ఆయన తెలిపారు. శుక్రవారం బెంగళూరు సంఘటనలో పది మంది గాయపడ్డారు. ‘పోలీస్ అధికారుల అభిప్రాయం ప్రకారం, మంగళూరు సంఘటనకు,

ఈ సంఘటనకు మధ్య సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది& (పేలుళ్ల కోసం) ఉపయోగించిన పదార్థాలలో పోలిక ఉంది. లింక్, టైమర్, ఇతర విషయాల మధ్య లింక్ చూడవచ్చు’ అని శివకుమార్ చెప్పారు. మంగళూరు, శివమొగ్గ నుంచి పోలీస్ అధికారులు ఇక్కడికి వచ్చారని, అన్ని కోణాలను పరిశీలిస్తున్నారని ఆయన తెలిపారు. ‘బెంగళూరు వాసులకు భయపడవలసిన అగత్యం లేదు. ఇది తక్కువ స్థాయి పేలుడు. దీనిని స్థానికంగానే తయారు చేశారు& కానీ శబ్దం హెచ్చుగా ఉంది. దుండగీడు టోపీ పెట్టుకున్నా, కళ్లజోడు ధరించినా అతని ముఖం అన్ని కోణాల నుంచి కనిపిస్తోంది. మూడు నాలుగు కోణాల నుంచి అతనిని చూడవచ్చు. అతని నడకను కూడా కెమెరాలు రికార్డు చేశాయి’ అని బెంగళూరు నగర అభివృద్ధి శాఖ మంత్రి కూడా అయిన శివకుమార్ చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News