Friday, December 20, 2024

17 శాతం పెరిగిన డీమార్ట్ లాభాలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా డీ మార్ట్ పేరిట సూపర్ మార్కెట్లను నిర్వహించే అతిపెద్ద రిటైల్ చైన్ అవెన్యూ సూపర్ మార్ట్ త్రైమాసిక ఫలితాలను శనివారం ప్రకటించింది. డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రూ.690.41 కోట్ల ఏకీకృత నికర లాభం నమోదు చేసింది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.589.64 కోట్లతో పోలిస్తే లాభం 17 శాతం పెరిగింది.అవెన్యూ సూపర్ మార్ట్ కార్యకలాపాల ద్వారా వచ్చే

ఆదాయం 17.31శాతం పెరిగి రూ.13,572.47కోట్లకు చేరిందని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో పేర్కొంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ ఆదాయం రూ.11,569.05గా ఉంది. కాగా కంపెనీ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా హరిశ్చంద్ర భరూకాను నియమించినట్లు యాజమాన్యం తెలిపింది. తమకు దేశవ్యాప్తంగా 341 స్టోర్లు ఉన్నట్లు తెలిపింది. ఎపి, తెలంగాణతో పాటుగా మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ , కర్నాటక,చత్తీస్‌గఢ్, ఢిల్లీ, ఎన్‌సిఆర్,తమిళనాడు, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో డీమార్ట్ స్టోర్స్ ఉన్నాయి.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News