Wednesday, January 22, 2025

కుటుంబ కథా చిత్రమ్

- Advertisement -
- Advertisement -

డిఎస్ కుటుంబంలో చేరికల చిచ్చు

శ్రీనివాస్ కాంగ్రెస్‌లో చేరిన మరుసటి రోజే పార్టీకి రాజీనామా ఎఐసిసి చీఫ్ ఖర్గేకు లేఖ
లెటర్‌ను విడుదల చేసిన డిఎస్ సతీమణి విజయలక్ష్మి కాంగ్రెస్ వాళ్లు ఇంటికి రావొద్దని కోరిన
వైనం మా నాన్నకు ప్రాణహాని ఉందన్న సంజయ్.. బ్లాక్‌మెయిల్ చేసి రాజీనామా చేయించారని
సోదరుడిపై ఆరోపణ రాజీనామాతో నాకు సంబంధం లేదు : ఎంపి అర్వింద్

ఇగో డిఎస్ గారి రాజీనామా..
ఇది రాజకీయాలు చేసే సమయం కాదు. ఆయనను మీరు పార్టీలో చేర్చుకునే పద్ధతి కూడా ఇది కాదు. ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చి, పక్షవాతం కూడా వచ్చింది. దయచేసి మీ రాజకీయాలకు ఆయనను వాడుకోవద్దు.
విజయలక్ష్మి, డిఎస్ సతీమణి

డర్టీ పాలిటిక్స్..
నా సోదరుడు అర్వింద్ కనుసన్నల్లోనే ఇదం తా జరిగింది. అర్వింద్ దిగజారి వ్యవహరి స్తున్నారు. రాజీనామా లేఖలు బిజెపి ఎంపి చేస్తున్న ‘డర్టీ పాలిటిక్స్’. ఆదేశిస్తే అ ర్వింద్‌పై పోటీ చేస్తా. బ్లాక్ మెయిల్ చేసి లేఖలు రాయిస్తున్నారు.
సంజయ్, కాంగ్రెస్ నేత

అసత్య ఆరోపణలు..
నా తండ్రి డిఎస్ రాజీనామాతో నాకెలాంటి సంబంధం లేదు. నాపై సోదరుడు సంజయ్ అసత్య ఆరోపణలు చేస్తున్నారు. నా బిజెపిలో చేర్పించడం లేదు. ఆయన చివరి వరకు కాంగ్రెస్‌వాదే.
ధర్మపురి అర్వింద్, ఎంపి

మన తెలంగాణ/హైదరాబాద్/నిజామాబాద్ బ్యూరో: సీనియర్ రాజకీయ నేత ధర్మపురి శ్రీనివాస్ (డిఎస్) కుటుంబంలో చేరికల చిచ్చు రేగింది. ఈ క్రమంలోనే ఆదివారం కాంగ్రెస్‌లో చేరిన డిఎస్ సోమవారం రాజీనామా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఈ మేరకు కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గేకు డిఎస్ రాజీనామా లేఖను పంపా రు. డిఎస్ రాజీనామా లేఖను ఆయన భార్య ధర్మపురి విజయలక్ష్మి మీడియాకు విడుదల చేశారు. కాంగ్రెస్ వాళ్లు, మీడియా వాళ్లు తమ ఇంటికి రావొద్దని విజయలక్ష్మి కోరారు. రాజీనామ లేఖను కూడా చూపించారు. డిఎస్‌కు ఆరోగ్యం సహకరించడం లేదని చెప్పారు. మరోవైపు ధర్మపురి విజయలక్ష్మి పేరుతో విడుదలై లేఖలో డిఎస్ గారి రాజీనామా.  రాజకీయాలు చేసే సమయం కాదు ! ఆయనను మీరు పార్టీలో చేర్చుకునే పద్దతి కూడా ఇది కాదు. ఆయనకు బ్రె యిన్ స్ట్రోక్ వచ్చి, పక్షవాతం కూడా వచ్చింది. దయచేసి.. మీ రాజకీయాలకు ఆయనను వాడుకోవద్దు. మీరు నిన్న పెట్టిన ఒత్తిడికి ఆయనకు రాత్రి ఫిట్స్ కూడా వచ్చింది.

కాంగ్రెస్ వాళ్లకి చేతులు జోడించి దండం పెడుతున్న! ఇం కోసారి ఇటువైపు రాకండి. ఈ వయసులో, అనారోగ్యంతో బాధపడుతున్న ఆయనను కొంచెం ప్రశాంతంగా బతకనీయండి” అని పేర్కొ న్నారు. అయితే కాంగ్రెస్‌లో చేరిన మరసుటి రోజే డిఎస్ ఆ పార్టీకి రాజీనామా చేయడం సంచలనంగా మారింది. అయితే ఆయన కుటుం బంలో నెలకొ న్న రాజకీయ ఘర్షణే ఇందుకు కారణంగా కనిపిస్తుంది. 8 ఏళ్ల కిందట కాంగ్రెస్‌ను వీడిన డిఎస్ బిఆర్‌ఎస్‌లో చేరారు. కొంతకాలానికి ఆ పార్టీకి దూరమయ్యారు. మరోవైపు డిఎస్ ఇద్దరు కుమారులలో ఒకరైన ధర్మపురి అరవింద్ ప్రస్తుతం బిజెపిలో కొనసాగు తున్నారు. అయితే ఆదివారం మరో కుమారుడు ధర్మపురి సంజయ్ కాంగ్రెస్‌లో చేరారు.

సంజయ్‌తో పాటు ఆరోగ్యం సహకరించకపోయినప్పటికీ వీల్ ఛైర్‌లో గాంధీ భవన్‌కు వచ్చిన డిఎస్ అక్కడ కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. అయితే ఈ పరిణామాలు ప్రస్తు తం బిజెపిలో ఉన్న అరవింద్‌కు ఇబ్బందికరంగా మారే పరిస్థితి ఉండటంతో కుటుంబంలో నెలకొన్న రాజకీయ ఘ ర్షణ నేపథ్యంలోనే తాజాగా డిఎస్ రాజీనామా ప్రకటన వె లువడినట్టుగా తెలుస్తోంది. ఈ పరిణామాలపై డిఎస్ పెద్ద కుమారుడు సంజయ్ స్పందించారు. తన తండ్రికి ప్రాణ హాని ఉందని సంచలన కామెంట్స్ చేశారు. తన తండ్రికి ఫి ట్స్ వస్తే ఇంట్లో ఎందుకు ఉంచారని ఆస్పత్రికి ఎందుకు తీసుకెళ్లలేదని ప్రశ్నించారు. అరవింద్‌కు కొందరు సహకరిస్తున్నారని వాళ్లు ఎవరో తెలుసునని అన్నారు. వాళ్లు పద్దతి మార్చుకుంటే మంచిదని చెప్పుకొచ్చారు. అరవింద్ కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతుందని ఆరోపించారు. అరవింద్ దిగజారి వ్యవహరిస్తున్నారన మండిపడ్డారు. రాజీనామా లే ఖలు బిజెపి ఎంపీ చేస్తున్న ‘డర్టీ పాలిటిక్స్’ అని విమర్శించారు. పార్టీ ఆదేశిస్తే అరవింద్‌పై పోటీ చేస్తానని అన్నారు. అ రవింద్ తన తండ్రిని బ్లాక్ మెయిల్ చేసి లేఖలు రాయిస్తున్నారని ఆరోపించారు. ఇక, తాను రెండేళ్లుగా కాంగ్రెస్‌లో చేరడానికి ఎదురు చూశానని చెప్పారు. తాను కాంగ్రెస్‌లో చేరడానికి సంబంధించి మహేష్ గౌడ్‌కు సమాచారం ఉందో లేదో తనకు తెలియదని అన్నారు. అయితే డిఎస్ ఇద్దరు కొడుకుల మధ్య నెలకొన్న రాజకీయ విభేదాలు తారా స్థాయికి చేరుకున్నట్టుగా తెలుస్తోంది.

డిఎస్‌తో సంజయ్ ఫోన్‌కాల్ వైరల్…

ఎంపి అర్వింద్ తండ్రిని బ్లాక్ మెయిల్ చేసి రాజీనామా లేఖ పై సంతకం చేయించారని సంజయ్ ఆరోపించారు. తన తండ్రి డిఎస్‌తో సంజయ్ ఫోన్ లో మాట్లాడినట్లుగా చెబుతున్న సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌య్యాయి. ఆ ఫోన్ సంభాషణలో ‘తనకు ప్రస్తుతం ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ రాజీనామా చేసేవరకు తనను హెరాస్ చేసిన ట్లు ఫోన్ కాల్‌లో డిఎస్ చెప్పారు. దీంతో డిఎస్‌కు సంజయ్ ధైర్యం చెప్పారు. కొన్ని వందల కుటుంబాలు మనకు అండ గా ఉన్నాయని డిఎస్‌తో అన్నారు. మీరో లెజెండ్, ధైర్యంగా ఉండండి డాడీ అని సజంయ్ అన్నారు. ఒక్క ఫోన్ కాల్ చేస్తే వేల మంది మన ఇంటికి వస్తారన్నారు. నువ్వు సంపాదించిన పెద్ద సైన్యం నీతో ఉందని డిఎస్‌కు ధైర్యం చెప్పా రు. ఒక్క సెకను కూడా భయపడాల్సిన అవసరం లేదంటూ డిఎస్‌తో ఫోన్‌లో సంజయ్ మాట్లాడారు. చివర్లో నువ్వు నవ్వితే ఫోన్ కట్ చేస్తానని సంజయ్ చెప్పారు దీంతో డిఎస్ పెద్దగా నవ్వినట్లు’ ఉందని సమాచారం.

కాంగ్రెస్‌ను అభాసుపాలు చేయాలనే : విహెచ్

కాంగ్రెస్ పార్టీకి డిఎస్ రాజీనామా చేస్తున్నట్లుగా ప్రకటించిన వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిం ది. దీనిపై వి.హనుమంతరావు (విహెచ్) స్పందించారు. తాము కాంగ్రెస్‌లోకి రమ్మనలేదన్నారు. కాంగ్రెస్‌ను అభాసుపాలు చేయాలని చూస్తున్నారని, ఢిల్లీకి వెళ్లి ఆయనే పార్టీలో చేరుతున్నట్లు చెప్పారని విహెచ్ అన్నారు. పార్టీలోకి వస్తానంటే ఆహ్వానించామని మీ కొడుకును కూడా పార్టీలో చేర్చుకోవాలని చెప్పానని పేర్కొ న్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News