Sunday, December 22, 2024

తారక్ ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో ‘దావూదీ..’

- Advertisement -
- Advertisement -

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అనేక సంచలనాలను సృష్టిస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్, యువ సుధ ఆర్ట్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్నఈ చిత్రంలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో అలరించబోతున్నారు. ‘దేవర’ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘ఫియర్ సాంగ్..’, ‘చుట్టమల్లె..’ సాంగ్స్ అద్భుతమైన స్పందనను రాబట్టుకోవటమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలను నెక్స్ రేంజ్‌కు తీసుకెళ్లాయి.

సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ సైతం ట్వీట్స్‌తో అంచనాలను పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ చిత్రం నుంచి ‘దావూదీ..’ అనే వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఎన్టీఆర్ డాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరోసారి ఈ పాటలో తారక్ ఎనర్జిటిక్ డ్యాన్స్‌తో అదరగొట్టేశారు. దీంతో ఈ పాట సినిమాపై అంచనాలను నెక్స్ లెవెల్‌కు తీసుకెళ్లింది. అనిరుద్ కంపోజ్ చేసిన ట్యూన్ ప్రతీ ఒక్కరినీ డ్యాన్స్ చేసేలా చేస్తోంది. రామజోగయ్య శాస్త్రి తెలుగులో రాసిన ఈ పాటను తమిళంలో విఘ్నేష్ శివన్, హిందీలో కౌసర్ మునీర్, కన్నడలో వరదరాజ్ చిక్‌బల్లాపుర, మలయాళంలో మాన్‌కొంబు గోపాలకృష్ణ రాశారు.

పాటను అద్భుతంగా పాడిన వారి విషయానికి వస్తే నకష్ అజీజ్, ఆకాశ తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఆలపించారు. నకష్ అజీజ్, రమ్యా బెహ్రా తమిళ, మలయాళంలో పాటను పాడారు. ఎన్టీఆర్ డ్యాన్స్ ఎలా ఉండాలని అభిమానులు, ప్రేక్షకులు కోరుకుంటారో దాన్ని మించేలా శేఖర్ మాస్టర్ సాంగ్‌కు కొరియోగ్రఫీ అందించారు. జాన్వీ లుక్ చాలా బావుంది. తారక్, జాన్వీ మధ్య కెమిస్ట్రీ చూడచక్కగా అనిపిస్తుంది. ఈ యాక్షన్ థ్రిల్లర్‌ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం ‘దేవర: పార్ట్ 1’ను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో ఈనెల 27న విడుదల చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News