Wednesday, January 22, 2025

’ది వారియర్’ మెలోడి సాంగ్ విడుదల..

- Advertisement -
- Advertisement -

'Dada Dada' melody Song out from 'The Warrior'

సత్య ఐపీఎస్ పాత్రలో యువ కథానాయకుడు రామ్ పోతినేని, విజిల్ మహాలక్ష్మిగా కృతి శెట్టి… వీళ్ళిద్దరూ జంటగా నటించిన సినిమా ’ది వారియర్’. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. చిత్రీకరణ పూర్తయింది. జూలై 14న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమాలోని రెండో పాట ’దడ దడ…’ను ప్రముఖ దర్శకులు గౌతమ్ మీనన్ శనివారం విడుదల చేశారు. ఈ గీతానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ శ్రావ్యమైన మెలోడీ బాణీ సమకూర్చగా… శ్రీమణి సాహిత్యం అందించారు. హరిచరణ్ పాటను ఆలపించారు. నిర్మాత శ్రీనివాసా చిట్టూరి మాట్లాడుతూ “హైదరాబాద్‌లోని అందమైన లొకేషన్స్‌లో పాటను చిత్రీకరించాం. అందరూ హమ్ చేసే విధంగా రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మంచి మెలోడీ అందించారు. ఇటీవల షూటింగ్ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి” అని చెప్పారు. రామ్, కృతి శెట్టి జంటగా నటించిన ఈ సినిమాలో ఆది పినిశెట్టి ప్రతినాయకుడి పాత్ర పోషించారు. అక్షరా గౌడ కీలక పాత్రలో కనిపిస్తారు.

‘Dada Dada’ melody Song out from ‘The Warrior’

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News