Wednesday, January 22, 2025

డైరెక్టర్ సుకుమార్ కుమార్తెకు ‘దాదా సాహెబ్ ఫాల్కే’ అవార్డు!

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి బండ్రెడ్డి కి చిన్న వయసులోనే అరుదైన ఘనత దక్కింది. ఆమె ముఖ్య పాత్రలో నటించిన ‘గాంధీ తాత చెట్టు’ అనే సందేశాత్మక చిత్రంలో ఉత్తమ నటిగా ‘దాదా సాహేబ్ ఫాల్కే’ అవార్డు దక్కింది. ఢిల్లీలో మంగళవారం జరిగిన అవార్డుల ప్రదానోత్సవంలో ఆమె ఈ అవార్డు దక్కింది. సుకృతి ప్రస్తుతం హైదరాబాద్ ఇంటర్నేషనల్ స్కూల్ లో గ్రేడ్ 8 చదువుతోంది. సుకృతి నటించిన ఈ చిత్రం గతంలో కూడా అనేక అంతర్జాతీయ ఫిలిమ్ ఫెస్టివల్స్ లో ప్రదర్శితమయింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News