Monday, January 27, 2025

పట్టాలు తప్పిన సౌరాష్ట్ర ఎక్స్‌ప్రెస్

- Advertisement -
- Advertisement -

గుజరాత్‌లోని సూరత్‌కు 27 కిమీ. దూరంలో ఉన్న కిమ్ స్టేషన్ వద్ద మంగళవారం దాదర్-పోర్బందర్ సౌరాష్ట్ర ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. రైలు నంబరు 19015 ఇంజను వెనకే ఉన్న నాన్‌ప్యాసెంజర్ కోచ్ తాలూకు నాలుగు చక్రాలు మధ్యాహ్నం 3.32 గంటలకు పట్టాలు తప్పాయి. రైలు పోర్బందర్‌కు వెళుతున్నప్పుడు ఈ ఘటన జరిగిందని పశ్చిమ రైల్వే చీఫ్ పిఆర్‌వో వినీత్ అభిషేక్ తెలిపారు. ‘ప్రయాణికులు లేక రైల్వే సిబ్బందికి.. ఎవరికీ ఎలాంటి గాయం లేక హానీ జరగలేదని, ఆ రూట్‌లో రైళ్ల రాకపోకలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలుగలేదన్నారు. ఎందుకంటే ఎక్స్‌ట్రా లూప్ లైన్ కూడా అక్కడ అందుబాటులో ఉంది’ అని ఆయన వివరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News