Tuesday, January 21, 2025

మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: భారత దేశంలో సినీరంగంలో గొప్ప సేవలు చేసిన వారికి దాదా సాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరిస్తారు. ఫాల్కే అవార్డుకు మిథున్ ఎంపికైనట్లు కేంద్ర సమాచార, ప్రసార మంత్రి అశ్వినీ వైష్టవ్ ట్వీట్ చేశారు. నటుడు మిథున్ చక్రవర్తికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది. అక్టోబర్ 8న దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును మిథున్ అందుకోనున్నారు.  ఈ ఏడాది జనవరిలో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ తో ఆయనను సత్కరించింది. 1976లో  ఆయన ‘మృగాయ’తో  సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1989లో 19 సినిమాలు విడుదల చేయడంతో లిమ్కా బుక్ ఆఫ్ రికార్డులోకి ఎక్కారు. హిందీ, బంగాల్, తెలుగులో నటించారు. తెలుగులో ‘మలుపు’ ‘గోపాలగోపాల’ చిత్రంలో నటించి అలరించారు. మిథున్‌కు మూడు నేషనల్ ఫిల్మ్ అవార్డులు, రెండు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు వరించాయి.
అమర్ దీప్, బాక్సర్, ముక్తి, బన్సారీ, సాహాస్, మే ఔర్ మేరా సాథి, గురు, కిక్, బాస్, డిస్కో డ్యాన్సర్, త్రినేత్ర, దుష్మన్, దలాల్, భీష్మ, కిస్మత్, కస్తూరి, భయనక్, ప్రేమ్ వివాహ్, వాంటెడ్ వంటి సినిమాలు ఆయన మంచి ప్రేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టాయి. ఐ మాయే డిస్కో డాన్సర్ అనే పాటతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News