Thursday, January 23, 2025

కోట్ల మందిని చంద్రబాబు మోసం చేస్తే పవన్ ఎందుకు ప్రశ్నించడంలేదు: దాడిశెట్టి

- Advertisement -
- Advertisement -

అమరావతి: తాను మంచి చేశానని భావిస్తేనే సిఎం జగన్ మోహన్ రెడ్డి ఓటు వేయమంటున్నారని మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. శనివారం మంత్రి దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడారు. అలా చెప్పే ధైర్యం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్‌కు ఉందా? అని సవాలు విసిరారు. టిడిపి ప్రభుత్వంలో ఆలయాలను కూల్చేస్తే పవన్ ఎందుకు మాట్లాడడం లేదని అడిగారు. కోట్ల మందిని చంద్రబాబు మోసం చేస్తే పవన్ ఎందుకు ప్రశ్నించడంలేదన్నారు. పవన్‌ను పార్టీ నాయకులు, కార్యకర్తలు సైక్రియాటిస్ట్‌కు చూపించాలన్నారు. పవన్ గంటకో నిర్ణయం పూటకో మాట మాట్లాడుతున్నారని దాడిశెట్టి రాజా దుయ్యబట్టారు.

Also Read: పుజారాపై వేటు తప్పదా?

ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పవన్ రెండు సభలు ప్లాప్ అయ్యాయని, ఎపిలో సభలు పెడితే జనం రారని దుయ్యబట్టారు. ఎక్కడ పోటీ చేస్తాడో పవన్‌కే క్లారిటీ లేదన్నారు. నువ్వు సిఎం అయిపోవాలనుకుంటే అయిపోవు అని, ప్రజలు మద్దతిస్తేనే అవుతారన్నారు. 2014-19లో టిడిపి, పవన్, బిజెపి కలిసి మేనిఫెస్టో రూపొందించారని, మేనిఫెస్టో హామీలు అమలు చేయలేకపోతే చంద్రబాబును నిలదీశావా? పవన్ అని దాడిశెట్టి రాజా దుమ్మెత్తిపోశారు. ఆంధ్రప్రదేశ్‌లో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయని, టిడిపి పాలనలోని పరిస్థితిని పవన్ కల్యాణ్ గుర్తుకు తెచ్చుకోవాలన్నారు. తన యజమాని చంద్రబాబు కోసమే పవన్ తాపత్రయం పడుతున్నారని దుయ్యబట్టారు. పవన్ తన నోటికి ఎది తోస్తే అది మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News