- Advertisement -
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని వైసిపికి చెందిన మాజీ ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా విమర్శలు గుప్పించారు. తునిలో టిడిపికి ఒక్క కౌన్సిలర్ కూడా లేడని ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా మీడియాతో దాడిశెట్టి మాట్లాడారు. తునిలో 30కి 30 కౌన్సిలర్లను వైఎస్ఆర్ సిపి గెలిచిందని ప్రశంసించారు. 9 మందిని మభ్యపెట్టి లాక్కొవడంతో పాటు వైఎస్ఆర్ కౌన్సిలర్లను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. ఛైర్ పర్సన్ ఇంటి చుట్టూ వేలాది మంది మోహరించారని, ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగిస్తున్నారని ధ్వజమెత్తారు. దీనిపై కచ్చితంగా కోర్టుకు వెళ్తామని హెచ్చరించారు. కోర్టులు, వ్యవస్థలంటే టిడిపికి లెక్కలేదని దాడిశెట్టి దుయ్యబట్టారు.
- Advertisement -